How I learn how to earn money online | నేను ఆన్ లైన్ లో డబ్బు సంపాదించడం ఎలా నేర్చుకున్నానో తెలుసా ?


నేను బ్లాగింగ్ మొదలుపెట్టడానికి ముందు కొన్ని "ఆన్ లైన్ మనీ ఎర్నింగ్ " అవకాశాలను ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని ప్రయత్నించాను. కానీ చాలా మోసాలు ఉంటాయని తెలుసుకున్నాను. అవి ఎలాంటివి అంటే మనుషులను మాయలో పడేసి మోసపోయేల చేస్తాయి.నేను D.T.P. కోర్స్ నేర్చుకొని, P.G.D.C.A లాంటి ప్రైమరీ కంప్యూటర్ కోర్స్ మొదలు పెట్టిన సమయంలో నాకొక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. న్యూస్ పేపర్ లో తాను ఇచ్చిన ఆకర్షణీయమైన ప్రకటన చూసి వెళ్లి కలిసాను.  అతను చెప్పిన మాటలు వింటే ఎవరైనా ఆకర్షితులవుతారు. అలా నేను, మరికొంత మంది అయ్యము. తర్వాత మోసపోయమాని తెలుసుకోవడానికి మాకు 6 నెలల సమయం పట్టింది.

మా మధ్య సంభాషణ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే :


నేను:     ఆన్ లైన్ ద్వారా మనీ సంపాదించ వచ్చు అన్నారు. పేపర్ లో ఆడ్ చూసి వచ్చాము.
అతను:  అవునండి ఆన్ లైన్ లో ఇంట్లో కుర్చుని డబ్బు సమ్పదించవచ్చు.
నేను:     అదెలా సాధ్యం ?
అతను:  సాధ్యం కానిదేది లేదు బ్రదర్. తలుచుకుంటే డబ్బు సంపాదించడం ఈ రోజుల్లో కష్టమేమీ కాదు. ఈ ఇంటర్నెట్ ప్రపంచం లో ఎన్నో అవకాశాలు మన ఇంట్లో ఉన్నాయి. కాకపోతే మనం గుర్తించట్లేదు. 
నేను:     కొంచెం వివరంగా చెప్తారా ? ( నాకు మనుసులో తెలుసుకోవాలనే కోరిక ఎక్కువైంది )
అతను:  చాలా సింపుల్ బ్రదర్. నేను కొన్ని వెబ్ సైట్స్ లిస్ట్ ఇస్తాను. వాటిని ఓపెన్ చేసి వాటిలోని ఆడ్స్ క్లిక్ చేస్తే   చాలు. అలా చేయడం ద్వారా మీకు డబ్బు వస్తుంది. దానిని P.T.C (Paid to Click) అంటారు. 
నేను:     ఆడ్స్ క్లిక్ చేస్తే డబ్బు ఎవరిస్తారు ? ( అనుమానంగా అడిగాను )
అతను:  మీరు టి.వి.  చూస్తున్నప్పుడు ప్రకటనలు వస్తాయి కదా ! వాటిని ఇచ్చిన కంపెనీ వారు టి.వి. చానెల్ వారికి డబ్బు ఇస్తారు. అదే విధంగా వెబ్ సైట్ లో ఆడ్ ఇచ్చిన కంపెనీ ఆ వెబ్ సైట్ ఓనర్ కి డబ్బులు చెల్లిస్తుంది. 
నేను:     మరి డబ్బులు వెబ్ సైట్ ఓనర్ కి వస్తాయని కాని, మనకెందుకు వస్తాయి ?
 ( నేను అలా అడగగానే అత్యుత్సాహం తో దబ్బులివ్వదానికి వచ్చిన 10 మంది ఆలోచనలో పడ్డారు )
             ---------- అది గమనించిన అతను తడబడుతూ ...... 
అతను:  అదే బ్రదర్ నేను సంపాదిస్తున్నాను కదా ? కావాలంటే ఒక సారి మా సర్ తో మాట్లాడమని చెప్పి ఫోన్       కలిపి.... హలో సర్ ఒకసారి మాట్లాడండి అంటూ నాకు ఫోన్  ఇచ్చాడు. 
నేను:     హలో సర్, "Online Money Earning" గురించి పూర్తి వివరాలు చెప్పండి. 
అతను:  హలో సర్, వెబ్ సైట్  ఉన్నటువంటి ఆడ్స్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే, ఆ సైట్ ఓనర్ కి డబ్బు వస్తుంది.       కాబట్టి ఆ work మన లాంటి వారికి ఇవ్వడం వలన మనం ఆడ్స్ క్లిక్ చేయగా వచ్చిన డబ్బు లో కొంత వెబ్-         సైట్ ఓనర్ తీసుకుని మనకు కొంత ఇస్తారు.
నేను:    కావాలని ఆడ్స్ క్లిక్ చేయడం తప్పు  ( illegal ) కదా ?
అతను:  సర్, అవన్నీ మనకెందుకు ? మనకు డబ్బు వస్తే చాలు కదా !
ఇలా  నేను అడిగిన ప్రతి ప్రశ్నకు అసంతృప్తి సమాధానాలు చెప్పినప్పటికీ, డబ్బు సంపాదించడం గ్యారంటీ అంటూ అసత్య ప్రమాణాలు చేసి ఒప్పించి  నాతో సహా వచ్చిన 10 మంది వద్ద నుండి డబ్బు తీసుకున్నారు.

అలా వారు మాతో

  • PTC (Paid to Click)
  • PTR (Paid to Read)
  • PTS (Paid to Surf)
  • Get Paid to Refer others
  • Paid Surveys

 ఇంకా రకరకాల పేర్లు చెప్పి 6 నెలల సమయం వృథా చేసారు. చివరికి ఓ రోజు అందరం కలిసి నిలదీస్తే కుంటి సాకులు చెప్పి పరార్ అయ్యారు. ఇలాంటి మోసాలు ఎన్నో చూసాను. ఇప్పటికి మోసపోతున్నవారు ఉన్నారు.

అలా మోసపోయిన మాట బాధాకరమయినా, నాకు ఒక్క మేలు మాత్రం జరిగింది.

అది ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే   ఇక్కడ క్లిక్ చేయండి


1 comments:


EmoticonEmoticon