How Internet Changed My Life | ఇంటర్నెట్ నా జీవితాన్ని ఎలా మార్చిందో తెలుసా

దీనికి ముందు ఏం జరిగిందో  తెలుసుకోవాలి అంటే   ఇక్కడ క్లిక్ చేయండి

ఇంటర్నెట్ అనే కొత్త ప్రపంచం నాకు పరిచయం అయ్యింది.  ఈ-మెయిల్ అంటే యాహూ!మెయిల్ మాత్రమే ఉపయోగించే రోజులవి. Gmail పరిచయం జరిగినా పెద్దగా ప్రాచుర్యం లోకి రాలేదప్పటికి. Yahoo! Messenger ఇంటర్నెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న సమయమది. అప్పుడు సోషల్ మీడియా అంటే Yahoo! Messenger లో " Public Chat rooms. " ఈ అవకాశాన్ని నేను ఇంటర్నెట్ గురించి, Online Earnings గురించి తెలుసుకోవడానికి ఉపయోగించుకున్నాను.Yahoo! Messenger Public Chat rooms లో  Online Earnings గురించి ప్రశ్నలెన్నో అడిగేవాడిని రకరకాల దేశాల వారు రకరకాల జవాబులు చెప్పేవారు. అలా నాకు పరిచయమైన ఓ గొప్ప వ్యక్తి పేరు గౌరీ శంకర్. ఆయన ఒక తమిళ భాషస్తుడు. అనతి కాలం లోనే మంచి మితృడయ్యారు.  అలా ఆయన తో నాకు జరిగిన మోసాన్ని వివరించాను. అది ఓపికగా విన్న ఆయన  "ఫ్రెండ్ జరిగినదేదో జరిగిపోయింది, జరిగిన సంఘటనలో మీరే సమాధానం చెప్పారు" అన్నారు. నేను "నాకు అర్థం కాలేదు" అన్నాను. అప్పుడు అతను నాకు ఆ మాటలు గుర్తుచేసారు.

" Website లో ఆడ్స్ క్లిక్ చేస్తే Website ఓనర్ కి డబ్బు వస్తుంది. "

సో, మీరే Website ఓనర్ అయితే, మీకే డబ్బు వస్తుంది కదా ? అన్నారు. ఏంటి సర్ జోక్ చేస్తున్నారా అన్నాను నేను. అప్పుడు అతను నాతో " చూడండి ఫ్రెండ్, తెలిసోతెలియకో మీరు నిజం చెప్పారు Website లో ఆడ్స్ క్లిక్ చేస్తే Website ఓనర్ కి డబ్బు వస్తుంది అనేది 100% నిజం. ఎందుకంటే నేను అలాగే సంపాదిస్తున్నాను అన్నారు. కాని Website కావాలంటే ఆ సమయం లో చాలా పెద్ద విషయం, గొప్ప విషయం కూడా. అదే విషయం అడిగితే ఆయనే Hosting అండ్ Domain రిజిస్టర్ చేసి ఇచ్చారు. అలాగే Web Designing కోసం HTML నేర్చుకోమని సలహా ఇచ్చి నేర్చుకోవడానికి కావలిసిన e-Book పంపించారు. అదే నా జీవితం లో నేను చుసిన మొదటి e-Book.

అలా నేను ఒక స్టాటిక్ అండ్ సింపుల్ Website కి ఓనర్ అయిపోయాను. కానీ అసలు సమస్య అప్పుడే మొదలైంది. ఆడ్స్ ఎలా ? అదే ప్రశ్న గౌరీ శంకర్ ని అడిగాను. అప్పుడు అతను నాకు పరిచయం చేసిన విధానం " Google Adsense ". అది నేర్చుకొని డబ్బు పొందడానికి కొంత సమయం పట్టింది కానీ, నిజంగా నేను డబ్బు చూసిన మొదటి Online Earning గూగుల్ ఆడ్సెన్స్ ద్వారానే.

ఆ విధంగా మొదలయిన Online ప్రయాణం లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కేవలం D.T.P. మరియు వీడియో ఎడిటింగ్ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్న నేను, స్వయం ఉపాది పొందుతూ ఇంటర్నెట్ సహాయం తో ఎన్నో Software లను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాను.

ఈ రోజు నేను ఎన్నో Websites, Blogs నడపగలుగుతున్నాను అంటే, Web Designing, Web Development, 2D  3D  Animation, System Trouble Shoot  లాంటివన్నీ చేయగలుగుతున్నాను అంటే కారణం ఇంటర్నెట్.

కావున, ఫ్రెండ్స్ మీరు సోషల్ మీడియా లో టైం పాస్ చేయడం ద్వారా సమయం వృధా చేయకుండా, ఏదైనా నేర్చుకోవడానికి ఇంటర్నెట్ ని ఉపయోగిస్తే జీవితం లో త్వరగా విజయం సాధిస్తారు. ఈ విషయం లో మీకు ఏదైనా సలహా, సూచన కావాలంటే నన్నడగండి, నేను మీకు సహాయం చేస్తాను.

" నన్ను నమ్మండి, ఇంటర్నెట్ లో మీరు ఏది కావాలన్న నేర్చుకోవచ్చు. "

మీ అనుభవాలు నాతో పంచుకోవలనుకుంటే కామెంట్ చేయండి.

14 comments

మీ అనుభవాలు నాతో పంచుకోవలనుకుంటే కామెంట్ చేయండి. :)

hi brother i'm struguling to get success plz help me

hai sir, nenu internet chala sarlu try cheysanu, kani chala mandi internet online work fruad anni mundukuvella leka pothunnanu plese help sir

Hi! Friends,meeru echina wab designing, chusanu ade vidhamanga chesanu adi net lo ela pettali

hi Sir, Iam Srinu I want to lern money through internet So Please help me how to learn money?

hi Sir, Iam Srinu I want to lern money through internet So Please help me how to learn money?

You Inspired me Sir, Your Videos are so useful and well explained, Thank You very much.

I want to start my blog but i am not able to invest that much amount on domain and hostinger. Give me a answer.
I am a Android and web developer

Just buy domain and hosting account. And then place all your files in your cpanel folder

Awesome tutorials
We all are waiting CS6 Advanced Tutorials

Thankyou very much sir

suggest a best screen capture? (what you are using)

Sir na Peru Shiva, nenu blog create chesanu kani Dhani look change cheyadaniki meeru first template lo latest stories chepetapudu, download zip file ah tharuvatha look change ani chaparu. Ashish ekkada ani cheppaledhu kaani naadhe thappu Benny Kotha ela download chesukolo nenu mee tho comment cheyalo meeru ippudu oka answer Mali naku na mail id ki pampandi please. Na mail id is div.failures@gmail.com sir idhi kuda meeku cheruthundha ani naku theloodhu kani please sir mee share cheyali ante elgo please chepandi.


EmoticonEmoticon